ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవేమీ లేదని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. కోల్ కతాలో లోకేష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్లీనరీ లో పాల్గొన్నారు. ‘ఎపిలో పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై ఆయన ప్రసంగించారు. ఎపిలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను వివరించారు. సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపిస్తున్నారని కొనియాడారు. ఇండస్ట్రియల్, మ్యానుఫాక్చరింగ్ హబ్ గా ఎపిని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు