భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు ఇవాళ అనూహమైన షాక్‌కు గురయ్యాయి. సుమారు 1.35 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఐటీ కన్సల్టెన్సీ యాక్సెంచుర్ కంపెనీ ఇచ్చిన రెవన్యూ రిపోర్టు.. భారతీయ ఐటీ కంపెనీలను తీవ్రంగా షేక్ చేసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ కంపెనీల స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. ఇన్ఫోసిస్ కంపెనీలో 8.5 శాతం ట్రేడింగ్ తగ్గిపోయింది. టెక్ మహేంద్ర షేర్లు 7 శాతం, TCS 6.52, HCL 6 శాతం, విప్రో షేర్లు 4.29 శాతం పడిపోయాయి