రక్షాబంధన్ పండుగ తేదీపై నెలకొన్న గందరగోళానికి పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో రాఖీ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోవాలని సూచించారు. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. రక్షాబంధన్‌ను ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది పౌర్ణమి ముగిసే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 28నే పండుగను నిర్వహించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.