‘వందేమాతం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని భాజపా తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయం గౌరవం విషయంలో ఎటువంటి రాజీకీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. వందేమాతరం ఘన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన నూతన జాతీయ కార్యవర్గం ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది.