అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లేముందు చాటిజీపీటీ, ఆన్లైన్లో లక్షణాలను చూసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మంచి విషయమే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఇది ముప్పుగా మారుతోందంటూ వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు రోగ లక్షణాలతో సంబంధం లేకుండా ఆన్లైన్లో వెతికి రోగనిర్ధారణ చేసుకుని వైద్యుల వద్దకు వెళ్తున్నట్లు తెలిపారు.