గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శిథిలాలు మీద పడి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను వెంటనే రెస్క్యూ టీమ్ సమీప ఆస్పత్రికి తరలించింది. శిథిలాల కింది మరో ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని డీఆర్‌ఎఫ్ సిబ్బంది అంచనా వేస్తోంది.