రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ గురిపెట్టింది. తాజాగా రష్యాలోపలికి దాదాపు 2,000 కిలో మీటర్లు చొచ్చుకెళ్లి మరీ ఉరల్ ప్రాంతంలోని ట్యూమెన్ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేసింది. ఇందుకోసం దీర్ఘశ్రేణి డ్రోన్లను వాడింది. కాకపోతే ప్రధాన ప్లాంట్ మాత్రం ఈ దాడిలో దెబ్బతినలేదని ఉరల్స్ గవర్నర్ అలెగ్జాండర్ మూర్ పేర్కొన్నారు. రష్యాలోని అతిపెద్ద ప్రైవేటు రిఫైనరీల్లో ట్యూమన్ కూడా ఒకటి. ఇక్కడ రోజుకు 1,51,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. రష్యాకు దేశీయంగా భారీగా చమురును సరఫరా చేస్తుంది.