అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత ఆంక్షలు సడలించడంతో నౌకల రాకపోకలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. ‘దేశ్ వైభవ్’, ‘దేశ్ విభోర్’, ‘సన్మార్ హెరాల్డ్’ అనే మూడు నౌకలు 94 మంది భారత సిబ్బందితో హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. భారతీయ జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో ఈ నౌకలు ప్రస్తుతం భారత ఓడరేవుల వైపు ప్రయాణిస్తున్నాయి.