ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. మెగాస్టార్ చిరంజీవి స్వగ్రామమైన మొగల్తూరులో ఆయన పర్యటన అత్యంత ఆసక్తికరంగా సాగింది. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా అక్కడకు చేరుకున్న ఆయన, స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. సీఎంతో ముచ్చటించే సమయంలో ఒక మత్స్యకారుడు తమ పడవలోకి రావాలని ఆయనను ఆప్యాయంగా కోరారు. ఆ ఆహ్వానాన్ని చిరునవ్వుతో స్వీకరించిన చంద్రబాబు, వెంటనే పడవ ఎక్కి వారితో కలిసి కాసేపు జలవిహారం చేశారు.