ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టిందని అన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.