కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్,వేణుగోపాల్ తో కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో గత కొద్ది రోజులుగా నడుస్తున్న మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ కు సంబంధించిన పరిణామాలపైనా కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.