కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. కరుడుగట్టిన తీవ్రవాదులు చిరాగ్‌ను చంపేస్తారంటూ ఆ పోస్ట్‌లో ఉంది. దీనిపై చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ బెదిరింపు పోస్ట్‌పై విచారణ జరపాలని, మంత్రి భద్రతను సమీక్షించాలని ఫిర్యాదులో కోరింది. ‘‘త్వరలోనే కరుడుగట్టిన ఉగ్రవాదులు నిన్ను చంపేస్తారు’’ అంటూ ఆ లేఖలో ఉంది. ఈ లేఖలో మొబైల్ నెంబర్లు కూడా ఉన్నాయి.