ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది చేపట్టిన ప్రతిష్టాత్మక మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలతో అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టిన వారు తక్షణమే విద్యాశాఖకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం నోటీసులు జారీ చేస్తామని ఓ ప్రకటనలో గట్టిగా హెచ్చరించింది.