ప్రపంచవ్యాప్తంగా ఎబోలా భయం నెలకొంది. అయితే తాజాగా భారతదేశంలోని బెంగళూరులో కూడా ఎబోలా వైరస్ వ్యాధి అనుమానిత కేసు ఒకటి గుర్తించడం ఆందోళన రేకెత్తించింది. ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమెను మంగళవారం బెంగళూరులోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎపిడెమిక్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆ మహిళ ఎబోలా ప్రభావిత ప్రాంతం నుండి వచ్చారు.