ఐపిఎల్ సీజన్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్1లో బెంగళూరు జయకేతనం ఎగుర వేసింది. బెంగళూరు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపిఎల్ నాకౌట్ మ్యాచుల్లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.