త్వరలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై అమెరికా తీవ్ర దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణ ఇరాన్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్స్ అమర్చుతున్న పడవలపై తాము ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్టు అమెరికా సైన్యం తెలిపింది. మరోవైపు టెహ్రాన్‌తో చర్చలు చాలా బాగా సాగుతున్నాయని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.