కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. దాంతో రుతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే మరికాస్త ఆలస్యం కానున్నాయి. కేరళలోని 14 కేంద్రాలలో కనీసం 60 శాతం కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అలాగే గాలి వేగం, మేఘాల సాంద్రత వంటివి కూడా అనుకూలంగా ఉండాలి. మే 25 నాటికి కేరళలో ఈ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదని ఐఎండీ తెలిపింది.