మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైకాపా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి పిల్ దాఖలు చేశారు. స్పోర్ట్స్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు రావట్లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేమని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల వినియోగానికి అనుమతిస్తే పిల్ ఉద్దేశం దెబ్బతింటుందని కోర్టు వ్యాఖ్యానించింది.