నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామానికి చెందిన గొల్ల మధుకృష్ణ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి గొల్ల బాలమద్దిలేటి మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య సుబ్బమ్మతో, కుమారుడు, కోడలితో తరచూ గొడవపడేవాడు. ఇదే విషయంపై తండ్రి, కుమారుడి మధ్య తీవ్ర వాగ్వాదం మద్యం మానాలని, కుటుంబ పరువు తీసేలా ప్రవర్తించవద్దని తండ్రిని మందలించాడని, అయితే వినకుండా ఆవేశానికి లోనైన తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలితో అర్థరాత్రి కుమారుడిపై దాడి చేయగా అతను మృతి చెందాడు.