డీఎంకే సోమవారం తంజావూరులో ఓ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో సభలోని డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా “త్రిష.. త్రిష” అంటూ గట్టిగా అరిచారు. కార్యకర్తల తీరును వారించాల్సిన ఉదయనిధి, నవ్వుతూ ద్వంద్వార్థలు వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం నీళ్లు రావాలంటూ ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదం కాగా, ఆ తర్వాత తాను కావేరి జలాల గురించే మాట్లాడానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.