దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మూడో దశను 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో దశలవారీగా చేపట్టనున్నట్లు గురువారం ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 30 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ఉన్నాయి. మొత్తం 36.73 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారు.