ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదనే అంశంపై అమెరికా, చైనా ఏకాభిప్రాయానికి వచ్చాయి. గురువారం చైనా రాజధాని బీజింగ్‌లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భేటీలో ఈమేరకు ఇరుదేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. ప్రపంచ దేశాలకు ఇంధన వనరుల సప్లై నిరాటంకంగా జరిగేందుకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. హర్మూజ్ జలసంధి సైనికీకరణను, దాని వినియోగానికి సుంకాన్ని విధించే ఏ ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తామని ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ స్పష్టం చేశారు.