మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేతగా నిలిచిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా జోహెరీకి కిరీటధారణ జరిగింది.