మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో పాక్ నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది.