ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయనిధి భార్య కృతిగ పోలీసులను కొంతసేపు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో ఆర్గ్యుమెంట్ కు దిగారు. చెన్నై నుంచి తంజావూరు వరకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉన్నందున కనీసం టాయిలెట్ అవసరాలను అయినా తీర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కృతిగ కోరారు. తాము ఎక్కువ సమయం వేచి ఉండలేమని పోలీసులు తేల్చి చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఉదయనిధి స్టాలిన్ బయటికి రావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.