ఏపీ మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మరణించారు. విశాఖలోని తన నివాసంలో తీవ్రమైన గుండెపోటుకు గురైన నాని మృతి చెందారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని.. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2013లో వైసీపీలో చేరారు.