భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ ముద్ర వేసిన గానకోకిల, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో సుబ్బులక్ష్మి పాత్రలో ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.