తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి వేదికపై చేసిన కొన్ని వ్యాఖ్యలే ఈ వివాదానికి ప్రధాన కారణమయ్యాయి. “ఆలోచించకుండా హామీలు ఇవ్వడం, సమస్యల నుంచి పారిపోవడం, ప్రతిదానికీ ప్రతిపక్షాలను నిందించడం సరైన నాయకుడి లక్షణం కాదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు CM విజయ్‌ను ఉద్దేశించి చేసినవేనని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతిపై, షో నిర్వాహకులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.