యునైటెడ్ కింగ్డమ్ నాలుగు దేశాలుగా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. యూకే నియంత్రణ నుంచి బయటకు వచ్చే ఉద్దేశాన్ని ప్రకటిస్తూ.. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు సోమవారం చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్లంతా యూకే నుంచి స్వాతంత్య్రం పొందడానికి కట్టుబడి ఉండటం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెస్ట్‌మినిస్టర్ (యూకే పార్లమెంట్) టైం ముగియబోతుందని ప్రపంచానికి అర్థం కావడానికి ఇంతకంటే స్పష్టమైన సంకేతం మరొకటి ఉండదు అని ఎంఓయూలో పేర్కొన్నారు.