అంతరిక్షంలో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ‘స్పేస్ కంట్రోల్ వెపన్స్ (Space Control Weapons)’ కక్ష్యలో ఉన్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. శత్రు దేశాల దాడుల నుంచి అమెరికా, మిత్రదేశాల బలగాలను రక్షించేందుకే వీటిని మోహరించినట్లు తెలిపింది. అయితే ఆయుధాల సంఖ్య, వాటి స్థానం, ఏ తరహా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారన్న వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అయితే అవి ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆయుధాలా, ఇతర రకాల వ్యవస్థలా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.