ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు 30వ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత సారంగపాణి వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే నాయిని అనుచరుడు మహిళలపై దాడి చేయడం కలకలం రేపుతోంది.