యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే కీలక బిల్లుకు లోక్‌సభ గురువారంనాడు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్-2007 సవరణ బిల్లుకు ఎలాంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ సవరణ బిల్లుతో ఇంతవరకూ యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీడీఆర్) రద్దవుతుంది. అయితే ఇక నుంచి యూపీఐ లావాదేవీలపై కూడా ఛార్జీలు విధిస్తారు.
ఈ బిల్లును విపక్షాల ఆందోళనల మధ్య ఆర్థిక మంత్రి గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.