ప్రధాని మోదీకి విదేశీ ప్రయాణాల ఖర్చులకు సంబంధించి విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. 2025లో మొత్తం 23 దేశాల్లో పర్యటించగా, ఇందుకోసం రూ.187 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపింది. 2021 నుంచి విదేశీ ప్రయాణాల కోసం మొత్తంగా సుమారు రూ.550 కోట్లకు పైగా ఖర్చయ్యిందని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.74 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంది. ఈ పర్యటనల (2021-2025) ఒప్పందాల్లో భాగంగా సుమారు 381 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది.