ఐబొమ్మ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వెబ్సైట్ కూడా అందుబాటులో లేకుండా పోవడంతో, ఇక ఐబొమ్మ కథ ముగిసిందని సినీ ఇండస్ట్రీ భావించింది. కానీ, రవి బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ యాక్టివ్లోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న అగ్ర హీరోల సినిమాలు, చిన్న చిత్రాలు సైతం ఈ వెబ్సైట్లో హెచ్డీ (HD) క్వాలిటీతో ప్రత్యక్షమవుతున్నాయి.

