టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఊహించని వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివారులోని మల్లారెడ్డి కాలేజీ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కసారిగా అదుపుతప్పిన క్రౌడ్ వల్ల తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానుల తాకిడితో గ్రౌండ్ మొత్తం గందరగోళంగా మారడమే కాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ రచ్చపై సీరియస్ అయిన పేట్ బషీరాబాద్ పోలీసులు మూవీ యూనిట్‌తో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశారు. బారికేడ్లు తోసుకుంటూ జనం లోపలికి చొచ్చుకెళ్లడంతో భారీ తోపులాట జరిగింది.