అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హోర్ముజ్ జలసంధిపై సంచలన పోస్ట్ చేశారు. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. కీలక హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. హోర్ముజ్ జలసంధిని ‘కొత్త అమెరికా భూభాగం’గా పేర్కొంటూ రూపొందించిన మ్యాప్‌ను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో మళ్లీ పోస్ట్ చేశారు. ఆగస్టు 18న ఇదే మ్యాప్‌ను తొలిసారి పంచుకున్న ట్రంప్.. తాజాగా మరోసారి దానిని పోస్ట్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతోందని ఇరాన్ చెబుతోంది