పశ్చిమ బెంగాల్లో నివసించే ప్రతి ఒక్కరూ విధిగా ‘వందేమాతరం’ ఆలపించాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తేల్చిచెప్పారు. దేశభక్తి మరియు జాతీయవాదం విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేయడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది

