పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యలో యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కి స్వాగతం పలుకుతూ నేడు అయోధ్యలో ఫిష్ ఫీస్ట్ నిర్వహించారు. అయితే పవిత్ర శ్రావణ మాసంలో ఇలాంటి మాంసాహార ఏర్పాట్లు చేయడం ఏమిటని స్థానిక మత గురువులు, సాధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మనోభావాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషాద్ సామాజిక వర్గ సాంప్రదాయంలో చేపలు పట్టడం, తినడం భాగమని, శ్రావణ మాసమైనా ఏ ఇతర మాసమైనా వ్యక్తుల ఆహారపు అలవాట్లపై ప్రశ్నలు లేవనెత్తకూడదని వారు వాదిస్తున్నారు.