ప్రపంచ చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా నిలిచిన అరుదైన వ్యక్తులలో బ్రిటన్‌కు చెందిన ఎథెల్ కేటర్‌హామ్ ఒకరు. కింగ్ ఎడ్వర్డ్ పాలనా కాలం నాటి తరం నుంచి నేటి వరకు జీవించి ఉన్న చివరి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల తన 117వ పుట్టినరోజును జరుపుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్‌మెంట్ (122 ఏళ్ల 164 రోజులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించడానికి ఎథెల్‌కు మరో ఐదేళ్ల కాలం మాత్రమే మిగిలి ఉంది.