హాకీ ప్రపంచకప్ లో రెండో రౌండ్లోకి అడుగుపెట్టిన భారత పురుషుల జట్టు శనివారం పూల్-ఈలో భాగంగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ కీలక మ్యాచ్ లో భారత్ 1-3తో పరాజయం చవిచూసింది. మ్యాచ్ లో భారత జట్టే అధిక సమయం బంతిని తన అధీనంలో ఉంచుకున్నప్పటికీ గోల్స్ చేయడంలో విఫలమైంది. మొదటి రెండు క్వార్టర్లలో ఇరుజట్లూ గోల్స్ చేయలేదు. రెండో అర్ధ భాగంలో నెదర్లాండ్స్ మూడు గోల్స్ చేసింది.