తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ టిపిసిసి క్రమశిక్షణా కమిటి ఛైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుండటంపై సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు