కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేపై మహారాష్ట్రలోని లాటుర్ జిల్లాలో కేసు నమోదైంది. స్కూల్ ఠీక్ ఖరో కార్యక్రమంలో భాగంగా ఓ పాఠశాలలోకి అక్రమంగా ప్రవేశించి.. టీచర్లను బెదిరించారని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దిప్కేతో పాటు పలువురు నిరసన కారులు అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించారని స్కూల్ యాజమాన్యం ఆరోపించింది. విద్యార్థుల మధ్యలో కూర్చుని వారు ఇబ్బంది పడేలా ప్రశ్నలు వేశారని ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.