తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందం బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో అత్యంత ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో విద్యా, పరిశోధన రంగాల్లో ఉన్న అపారమైన భాగస్వామ్య అవకాశాలపై ఈ ఉన్నతస్థాయి భేటీలో కేంబ్రిడ్జ్ ప్రతినిధులతో తెలంగాణ బృందం సుదీర్ఘంగా చర్చించింది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలు తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరంలో ఉన్న అనుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి వారికి కూలంకషంగా వివరించారు.