loader

ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద శనివారం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. పిల్లలను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తారకరామా ఎత్తిపోతల కాలువలోకి దూసుకెళ్లింది. ఇబ్రహీంపట్నం నుంచి కవులూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారిలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. స్థానికుల సాయంతో చిన్నారులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON