ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ దాదాపు 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ కోతలు ప్రధానంగా SIRI డిజిటల్ అసిస్టెంట్, విజన్ ప్రో హెడ్ సెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్ వేర్ విభాగాల్లో జరిగాయి. ఇందులో విజన్ ప్రో హార్డ్వేర్ విభాగం నుంచి దాదాపు 100 పోస్టులు, సిరి, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ బృందాల నుంచి మరో 100 పోస్టులను తొలగించినట్లు తెలుస్తోంది. విజన్ ప్రో కోసం గేమింగ్ ఫీచర్లను డెవలప్ చేస్తోన్న విభాగాన్నికంపెనీ పూర్తిగా మూసివేసింది.