గచ్చిబౌలిలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ సర్కిల్–50 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ప్రొఫెషనల్ ఆఫీసర్ యు సంతోష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సీఎంసి కమిషనర్ జీ శ్రీజన ఆదేశాలు జారీ చేశారు.సస్పెన్షన్ కాలంలో ఆయన ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. భవన యజమానులు ఫర్హీన్ సిద్ధిఖ్, మహ్మద్ సాజిద్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులు కోరారు.