తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 68 నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇబరాకి, సైతామా, చిబా, టోక్యో సహా పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 5 లోయర్ తీవ్రత నమోదైంది.