కృత్రిమ మేధ (AI) అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మనుషులకంటే తెలివైన, తనను తాను నిరంతరం అభివృద్ధి చేసుకునే ఏఐ వ్యవస్థలు దశాబ్దం ముగిసేలోపే మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించారు.ఈ ఆందోళనల కారణంగానే ఆంత్రోపిక్ నుంచి వైదొలుగుతున్నట్లు కాక్సన్ ప్రకటించారు. స్తుతం ఉన్న ఏఐ మోడళ్ల గురించి కాకుండా.. భవిష్యత్తులో తనను తాను మెరుగుపరుచుకునే సూపర్‌ఇంటెలిజెన్స్ ఏర్పడటమే తన ప్రధాన ఆందోళన అని ఆయన వివరించారు.