కాక్రోచ్ జనతాపార్టీ (CJP) నిరసనల్లో పాల్గొన్న విద్యార్థికి గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. “ఆ నోటీసులు ఎలా ఇస్తారు. దేశవ్యాప్తంగా ఏ విద్యార్థి పైనా బలవంతపు చర్యలు వద్దని ఇప్పటికే మా ఆదేశాల్లో స్పష్టంగా చెప్పాం. అయినా నోటీసులు ఇవ్వడానికి మేజిస్ట్రేటు ఎంత ధైర్యం” అని న్యాయస్థానం ప్రశ్నించింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలో పాల్గొనాలని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారంటూ గ్రేటర్ నోయిడా విద్యార్థికి సెప్టెంబర్ 4న నోటీసులు జారీ అయ్యాయి.