మూడేళ్ల క్రితం ఇదే రోజు, రాజకీయ కక్ష సాధింపులకు తెరలేపిన గొడ్డలి పార్టీ చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసి, అర్ధరాత్రి నిర్బంధించి 53 రోజుల పాటు జైల్లో పెట్టిందని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమ కేసులతో చంద్రబాబును వేధించినా, ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మాత్రం “నిజం గెలవాలి” అంటూ ఆయనకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. చివరకు కక్ష సాధింపు రాజకీయాలకు, అక్రమ కేసులకు న్యాయస్థానాలే చెక్ పెట్టాయని, చంద్రబాబు నిర్బంధం నుంచి బయటకు వచ్చారని తెలిపారు.